పోలవరం పరిహారంలో కోత: న్యాయం చేయాలని నిర్వాసితుడి డిమాండ్|

0
1

పోలవరం ప్రాజెక్ట్ ముంపు బాధితులకు పరిహారం పంపిణీలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. చింతూరు బి.సి. కాలనీకి చెందిన నిర్వాసితుడు షేక్ జానీకి అవార్డు నోటీసు ప్రకారం రావాల్సిన మొత్తం కంటే రూ. 4,44,858/- తక్కువగా జమ చేశారు. అధికారులే తమ పొరపాటని అంగీకరించి డ్రాఫ్ట్ అవార్డు సిద్ధం చేసినప్పటికీ, ఎస్డీసీ మాట మారుస్తూ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ధవళేశ్వరం పీఐపీ వద్ద కూడా అధికారుల తప్పిదమేనని తేలినా పరిష్కారం చూపడం లేదని వాపోయారు. ఉన్నతాధికారులు స్పందించి బకాయి పరిహారాన్ని వెంటనే విడుదల చేయాలని, లేకుంటే నిర్వాసితులతో కలిసి న్యాయపోరాటం చేస్తామని బాధితుడు హెచ్చరించారు.

 

# Yadagiri