భద్రాచలం బస్టాండ్‌లో దుర్వాసనల గోస.. పట్టించుకోని అధికారులు!|

0
2

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలం ఆర్టీసి బస్టాండ్‌లో అధికారుల నిర్లక్ష్యం ప్రయాణికులకు శాపంగా మారుతోంది. బస్టాండ్ ఆవరణలో పారిశుద్ధ్య నిర్వహణ పూర్తిగా గాలికొదిలేయడంతో తీవ్ర దుర్వాసన వస్తోంది.

బస్టాండ్ పరిసరాల్లో కొందరు బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తుండటంతో ప్రయాణికులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల కోసం గంటల తరబడి వేచి ఉండే ప్రయాణికులు దుర్వాసన భరించలేక నానా అవస్థలు పడుతున్నారు. ప్రయాణికుల రద్దీకి తగినట్లుగా మరుగుదొడ్లు అందుబాటులో లేకపోవడం, ఉన్న వాటిని కూడా సరిగ్గా నిర్వహించకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొంది.

ఇప్పటికైనా సంబంధిత ఆర్టీసి మరియు పంచాయతీ అధికారులు స్పందించి, బస్టాండ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని… బహిరంగ మూత్ర విసర్జనకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.