ఇస్కదామెర్లలో ఘనంగా పోలేరమ్మ పొంగళ్ళు|

0
0

ఆగస్టు 23:

నెల్లూరు జిల్లా కొండాపురం మండలం ఇస్కదామెర్ల గ్రామంలోని కేవీఆర్‌ కాలనీలో ఆదివారం పోలేరమ్మ పొంగళ్ళు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామ ప్రజలు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, పొంగళ్ళు సమర్పించారు.

ఈ సందర్భంగా మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోలేరమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామ ప్రజల సుఖశాంతులు, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత, మహిళలు మరియు భక్తులు పాల్గొన్నారు.

వార్తా రచయిత:

వల్లేరు సింహాద్రి

భారత్ ఆవాజ్