కుమురం భీం ఆసిఫాబాద్‌లో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల దరఖాస్తులు|

0
1

🎤కుమరం భీం ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం అర్హులైన ఉపాధ్యాయుల నుండి దరఖాస్తులను కోరుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యా రంగంలో ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులను ఈ అవార్డుల కోసం ఎంపిక చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా GHM-Gr-II, SA, మరియు SGT విభాగాల నుండి అత్యుత్తమ సేవలు అందించిన ముగ్గురు ఉపాధ్యాయులను ఎంపిక చేయనున్నారు. అర్హత మరియు ఆసక్తి గల ఉపాధ్యాయులు తమ దరఖాస్తులను ఆగస్టు 27వ తేదీ లోపు సంబంధిత ఎంఈఓ (MEO) ఆఫీసులలో అందజేయాలని సూచించారు. అయితే గతంలో ఈ అవార్డులు పొందిన వారికి ఈసారి దరఖాస్తు చేసుకునే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఎంపికైన ఉపాధ్యాయులకు సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అవార్డులను ప్రదానం చేయనున్నారు.