బీసీల సమగ్ర కుల గణన చేపట్టాలి బీసీ సంక్షేమ సంఘం డిమాండ్|

0
1

🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్): దేశవ్యాప్తంగా చేపట్టే జనగణనలో బీసీల సమగ్ర కుల గణనను శాస్త్రీయంగా, పారదర్శకంగా నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు రూపూనార్ రమేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా అదనపు కలెక్టర్‌కు సంఘం ప్రతినిధులతో కలిసి ఆయన ఒక వినతిపత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా రూపూనార్ రమేష్ మాట్లాడుతూ.. బీసీలకు జనాభా ప్రాతిపదికన న్యాయమైన రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో వెనుకబడిన వర్గాలకు తగిన ప్రాతినిధ్యం దక్కాలని ఆకాంక్షించారు. రాబోయే జనగణనలో కులాల వారీగా వాస్తవ జనాభాను అధికారికంగా నమోదు చేయాలని, అప్పుడే బీసీలకు సంపూర్ణ న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం ముఖ్య నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.