ఆసిఫాబాద్ పట్టణంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ|

0
1

🎤ఆసిఫాబాద్(భారత్ ఆవాజ్ న్యూస్): ఆసిఫాబాద్ పట్టణంలోని 16వ వార్డులో సోమవారం లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ ఆకాష్, వైస్ చైర్ పర్సన్ ఎం.డి. అహ్మద్, కౌన్సిలర్ దూడల లక్ష్మి గార్లు లబ్ధిదారులకు ఈ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు. ప్రజలకు మరింత సులభంగా, పారదర్శకంగా సేవలు అందించేందుకు ఈ స్మార్ట్ కార్డులు ఉపయోగపడతాయన్నారు. కార్డులు రాని వారు వెంటనే రేషన్ డీలరును సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది అభిషేక్, రేషన్ డీలర్ శ్రీను, కాలనీవాసులు పాల్గొన్నారు.