సీతానగరం మండలం ఏగోటివలస, అనంతరాయుడుపేట గ్రామాల్లో బుధవారం ఎమ్మెల్యే విజయ్ చంద్ర పర్యటించారు. రెండేళ్ల అభివృద్ధి సంక్షేమం కార్య క్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
ఎన్టీఆర్ భరోసా, తల్లికి వందనం, దీపం-2, స్త్రీ శక్తి, అన్నదాత సుఖీభవ, అన్న క్యాంటీన్లు తదితర పథకాల ప్రయోజనాలను వివరించారు.










