తెనాలి రూరల్ మండలం పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 87 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు అయినాయి.మండలంలోని 18 గ్రామాల్లో బుర్రిపాలెం ఏకగ్రీవంగా కాగా, మిగిలిన 17 గ్రామాలకు చెందిన ఎన్నికల విధుల ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. గురువారంతో ఈ ప్రక్రియ ముగిసింది. వీటిని స్టేజి 2 ఆర్వోలకు అప్పగించి,ఈనెల 29న లెక్కింపుల్లో ముందుగా లెక్కిస్తారు.









