ఏపీకి ₹840 కోట్ల కేంద్ర నిధులు.. గడ్కరీకి చంద్రబాబు ధన్యవాదాలు |

0
3

ఆంధ్రప్రదేశ్‌లో కీలక జాతీయ రహదారి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీ నిధులు మంజూరు చేసింది. జాతీయ రహదారి-365BB విస్తరణ కోసం రూ.840.41 కోట్లను కేటాయించినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. దీనిపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీ, గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ రహదారి విస్తరణతో పోలవరం ప్రాజెక్టుకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. అలాగే పొగాకు, చెరకు, పామాయిల్, ఆక్వా రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్లకు వేగంగా తరలించేందుకు అవకాశం లభించనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఏపీ మౌలిక సదుపాయాల రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతోందని చంద్రబాబు పేర్కొన్నారు.