2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యాన్ని సాధించాలంటే పటిష్ఠమైన అంతర్గత భద్రత అత్యవసరమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఢిల్లీలో జరిగిన ఇంటెలిజెన్స్ బ్యూరో జాతీయ భద్రతా సదస్సులో ఆయన మాట్లాడుతూ చొరబాట్లు.
ఉగ్రవాదం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి ముప్పులపై ముందస్తు వ్యూహాలు అవసరమన్నారు. రాబోయే 15 నుంచి 20 ఏళ్లలో ఎదురయ్యే సవాళ్లను ఇప్పటి నుంచే గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు. సరిహద్దు భద్రత కోసం నాలుగు అంచెల ప్రణాళికను అమలు చేస్తున్నామని తెలిపారు. అక్రమ చొరబాటుదారులు జాతీయ భద్రత, ఆర్థిక స్థిరత్వం, జనాభా సమతుల్యతకు ముప్పుగా మారుతున్నారని అమిత్ షా హెచ్చరించారు.










