గాంధీనగరం పరిసరాల్లో ఏనుగుల సంచారం |

0
1

కొమరాడ మండలం గాంధీనగరం పరిసరాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు పర్యవేక్షణ అధికారులు గురువారం తెలిపారు. సమీప జలప్రాంతాల్లో తిరుగుతున్నాయని, ఆ ప్రాంతానికి ప్రజలు వెళ్లొద్దని హెచ్చరించారు.

ఎలిఫెంట్ ట్రాకర్స్ సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏనుగుల గుంపుతో తీవ్రంగా పంట నష్టం కలుగుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు.