రాఖీ పౌర్ణమి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ తెలుగింటి అక్కాచెల్లెళ్లందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా ఒక భావోద్వేగపూరితమైన సందేశాన్ని పోస్ట్ చేశారు. తోబుట్టువులు లేని తనకు దేవుడే కోట్లాది మంది సోదరీమణులను ఇచ్చాడని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ తన పోస్టులో.. “తోడబుట్టిన సోదరీమణులు లేని నాకు దేవుడే కోట్లాదిమంది సోదరీమణులను తోడుగా ఇచ్చాడు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్లినా అక్కా చెల్లెళ్లు చూపించే ప్రేమాభిమానాలు మరువలేను. మహిళాలోకం ఆత్మీయత నాలో మరింత బాధ్యతను పెంచింది” అని అన్నారు










