AP: గిరిజన యువతకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. గిరిజనులకే గిరిజన ప్రాంతాల్లోని ఉద్యోగాలు కల్పించేలా త్వరలోనే జీవో తెస్తామన్నారు. అందరికీ ఆమోద యోగ్యంగా జీవో తెస్తామని వెల్లడించారు. కాగా, ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలను అందించే ఉద్దేశంతో రూపొందించిన.
‘సంజీవని’ ప్రాజెక్టు ప్రారంభోత్సవం కోసం అల్లూరి జిల్లా అరకులోయ మండలం గన్నెల గ్రామంలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో గిరిజనులకు శుభవార్త వినిపించారు.










