వంగర మండలం శ్రీహరిపురం గ్రామ సమీపంలో ఓ వాహనం బోల్తా పడ్డ ఘటన ఆదివారం ఉదయం చోటు జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
గ్రామం నుంచి రాజాం వెళ్తున్న బొలెరో వ్యాన్ ఒక్కసారిగా అదుపుతప్పడంతో పంట పొలాలకు దూసుకు వెళ్లింది. ఆ సమయంలో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. స్థానికులు వాహనాన్ని పొలంలో నుంచి బయటకు తీస్తున్నారు.










