ఉచిత వెంటిలేటర్ అంబులెన్స్ సేవలు ప్రారంభం.. |

0
12

మంచిర్యాలలో ఉచిత వెంటిలేటర్ అంబులెన్స్ సేవల ప్రారంభం

మంచిర్యాల నియోజకవర్గంలోని లక్షెట్టిపేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వెంటిలేటర్ అంబులెన్స్ సేవలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రారంభించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను మెరుగైన వైద్యం అందించే ఆసుపత్రులకు సురక్షితంగా తరలించేందుకు ఈ సేవలు ఎంతో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే తెలిపారు.

పేద, సామాన్య ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమన్నారు. అనంతరం ఆసుపత్రిని సందర్శించి వైద్యులతో మాట్లాడారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రతిమ ఇన్‌స్టిట్యూట్ సీఈఓ రామచంద్రరావు, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ శ్రీనివాస్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.