డిగ్రీ, బీటెక్ విద్యార్థులకు ఉచిత సీఆర్టీ శిక్షణ
డిగ్రీ, బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్మెంట్లలో ఉద్యోగావకాశాలు మెరుగుపరిచేందుకు అప్టెక్ సొల్యూషన్స్ ఉచిత క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ నిర్వహిస్తోంది. విజయవాడ గవర్నర్‌పేటలోని అప్టెక్ సొల్యూషన్స్ కార్యాలయంలో డైరెక్టర్ ఈడే లక్ష్మీపతి ఈ వివరాలు వెల్లడించారు.
గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, ఇంటర్వ్యూ నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యమన్నారు. ప్రతి ఆదివారం, ప్రభుత్వ సెలవు రోజుల్లో శిక్షణ అందుబాటులో ఉంటుందని తెలిపారు. శిక్షణలో ఆప్టిట్యూడ్, రీజనింగ్, వెర్బల్ ఎబిలిటీ, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, రెజ్యూమ్ బిల్డింగ్‌పై అవగాహన కల్పిస్తామని చెప్పారు. మాక్ టెస్టులు, నమూనా ఇంటర్వ్యూలు నిర్వహించి విద్యార్థులను ఉద్యోగ నియామకాలకు సిద్ధం చేస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు 9177866999లో సంప్రదించాలని సూచించారు.










