● మాస్టర్స్ అథ్లెటిక్స్ మీట్‌లో ఎమ్మెల్యే శ్రీగణేష్
● 95 ఏళ్ల వయసులోనూ క్రీడల్లో పాల్గొంటున్న వారిని అభినందన
● యువతను క్రీడలు, వ్యాయామం వైపు ప్రోత్సహిస్తాం
అల్వాల్, ఆగస్టు 30: ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు. సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్‌లో 35 ఏళ్లు పైబడిన వారికి నిర్వహించిన మాస్టర్స్ అథ్లెటిక్స్ మీట్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు ఎమ్మెల్యే మెడల్స్, బహుమతులు అందజేశారు. 95 ఏళ్ల వయసులోనూ ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొంటున్న క్రీడాకారులను అభినందించిన ఆయన.. వారి ఫిట్‌నెస్, క్రీడాస్ఫూర్తి నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు.
క్లీన్ కంటోన్మెంట్‌తో పాటు ఫిట్ కంటోన్మెంట్‌ను నిర్మించడమే తన లక్ష్యమని శ్రీగణేష్ స్పష్టం చేశారు. యువత క్రీడలు, వ్యాయామం వైపు ఆసక్తి పెంచుకునేలా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్‌తో కలిసి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
కంటోన్మెంట్‌లో క్రీడలకు మరింత ప్రోత్సాహం అందించేందుకు తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
#sidhumaroju
Alwal










