చివరి మజిలీకీ కష్టాలే! |

0
0

మెంటాడ (M) గుర్లలో శ్మశాన వాటికకు రహదారి లేకపోవడంతో మృతదేహాన్ని కిలోమీటరు మేర మోసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. సోమవారం దళిత కాలనీలో మృతి చెందిన వ్యక్తి భౌతికకాయాన్ని గ్రామస్థులు గెడ్డ దాటిస్తూ కష్టంపై శ్మశానవాటికకు చేర్చి అంత్యక్రియలు నిర్వహించారు.
అన్ని వర్గాలకు ఇదే ఉమ్మడి శ్మశానవాటిక కావడంతో రహదారి, గెడ్డపై కల్వర్టు నిర్మించి సమస్యకు పరిష్కారం చూపాలని గ్రామస్థులు కోరుతున్నారు.