మంచిర్యాల గోదావరి తీరంలో మరో అభివృద్ధి అధ్యాయం ప్రారంభం!

0
0

మంచిర్యాల గోదావరి వద్ద ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న పుష్కరఘాట్ అభివృద్ధి పనుల భూమి పూజ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ , మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  పాల్గొని పనులకు శ్రీకారం చుట్టారు,

గోదావరి తీరాన్ని ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ పుష్కరఘాట్ అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో DCP భాస్కర్ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య- మహేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, సంబంధిత అధికారులు, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కార్పొరేటర్ తూముల నరేష్, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..