పదవి లేకున్నా కార్యకర్తలకు అండగా ఉంటా: చల్లా బాబు

0
1

అన్నమయ్య జిల్లా పుంగనూరు టీడీపీ ఇంచార్జ్ మార్పుపై మాజీ ఇంచార్జ్ చల్లా బాబు స్పందించారు. 40 ఏళ్లుగా పార్టీలోనే కొనసాగుతున్నానని, చంద్రబాబు నాయుడుకు కట్టుబడి ఉంటానని, పదవి ఉన్నా లేకపోయినా కార్యకర్తలకు అండగా ఉంటానని తెలిపారు.

కార్యకర్తలు తనతో పాటు జైలుకు వెళ్లారని, వారిని ఎప్పటికీ మర్చిపోనని భావోద్వేగానికి గురయ్యారు. కొంతమంది బురద రాజకీయాలు చేస్తూ నియోజకవర్గాల్లో రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేశారని విమర్శించారు. కార్యకర్తలు తన దగ్గరకు ఎప్పుడైనా రావచ్చని భరోసా ఇచ్చారు# కొత్తూరు మురళి.