జిల్లా *ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్,.* గారి ఆదేశాలతో డ్రోన్ల నిఘా, కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు నడుమ అన్నమయ్య జిల్లాలో *”నీట్ పీజీ పరీక్షలు”* ప్రశాంతంగా ముగిశాయి.
రాయచోటి డిఎస్పీ కృష్ణమోహన్, మదనపల్లె, డీఎస్పీ బుచ్చిరాజు, పర్యవేక్షణలో జిల్లాలోని నాలుగు ఇంజనీరింగ్ కళాశాల (బిట్స్, శ్రీ సాయి, మిట్స్, ఆదిత్య) కేంద్రాలలో పరీక్షలు పకడ్బందీగా నిర్వహించారు.
జిల్లా వ్యాప్తంగా ఈ పరీక్షలకు మొత్తం 747 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 717 మంది పరీక్ష రాశారు. 30 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు స్పష్టం చేశారు.
పోలీసు శాఖ ముందస్తు జాగ్రత్తలు, పకడ్బందీ ఏర్పాట్ల నడుమ పరీక్షలు సజావుగా ముగియడంతో అధికారులతో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.










