కూకట్‌పల్లిలోని కేపీహెచ్‌బీ ఐరిస్ బిల్డింగ్‌లో మహిళల కోసం ఏర్పాటు చేసిన “షీ డిజైనర్ స్టూడియో” ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, టీపీసీసీ ఉపాధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్, శ్రీమతి బండి లకుమ దేవి ముఖ్య అతిథులుగా హాజరై స్టూడియోను లాంఛనంగా ప్రారంభించారు.
ప్రస్తుత ఫ్యాషన్ ట్రెండ్‌కు అనుగుణంగా మహిళలకు నాణ్యమైన, ఆకర్షణీయమైన డిజైనర్ దుస్తులు అందించడం అభినందనీయమని బండి రమేష్ పేర్కొన్నారు. షీ డిజైనర్ స్టూడియో నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, సంస్థ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ బాబు, గాదే శివ చౌదరి, రామారావు, రమణ, సంధ్య, కల్పన తదితరులు పాల్గొన్నారు.










