మంచిర్యాల జిల్లా : దండేపల్లి మండలం గూడెం గోదావరి వద్ద పుష్కరఘాట్ పనులకు భూమి పూజ కార్యక్రమంలో మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు , మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ పాల్గొని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు,గూడెం గోదావరి పుష్కరఘాట్ను భక్తులకు మరింత సౌకర్యవంతంగా, సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు.
పర్యాటక మరియు ఆధ్యాత్మిక ప్రాధాన్యతను పెంచేలా అభివృద్ధి చేయడం లక్ష్యంగా పనులు చేపడుతున్నారు,ప్రజల అవసరాలు, భక్తుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలని సంబంధిత అధికారులకు, పోలీస్ శాఖ అధికారులు పలు సూచనలు చేశారు,మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు.










