మంచిర్యాల: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన TVS E-Vehicle Pvt. Ltd. షోరూమ్‌ను మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రారంభించారు.
ఈ సందర్భంగా సురేఖ షోరూమ్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం యాజమాన్యం ఆమెను శాలువాతో ఘనంగా సన్మానించింది.
కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, కార్పొరేటర్ సుదమల్ల హరికృష్ణ, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గజ్జల హేమలత, టీపీసీసీ సభ్యులు, నస్పూర్ పట్టణ ఇన్‌చార్జి నూకల రమేష్తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










