● రూ.19 లక్షల విలువైన 1.9 కిలోల డ్రగ్ స్వాధీనం
● ఐదుగురు సభ్యుల అంతర్‌జిల్లా ముఠా అరెస్ట్
● ముఠా సూత్రధారి మాజీ ఎక్సైజ్ కానిస్టేబుల్.. ఇప్పటికే మూడు NDPS కేసులు
అల్వాల్, సెప్టెంబరు 2: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పేట్ బషీరాబాద్ పోలీసులు కొంపల్లి పరిసరాల్లో అల్ఫ్రాజోలం డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేశారు.
నిఘా వర్గాల నుంచి అందిన పక్కా సమాచారంతో నిర్వహించిన దాడుల్లో ఐదుగురు సభ్యుల అంతర్‌జిల్లా ముఠాను అరెస్ట్ చేసి, వారి నుంచి సుమారు రూ.19 లక్షల విలువైన 1.9 కిలోల అల్ఫ్రాజోలం స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లాకు చెందిన మాజీ ఎక్సైజ్ కానిస్టేబుల్ గొల్ల రమేశ్ ఈ ముఠాకు ప్రధాన సూత్రధారిగా వ్యవహరిస్తున్నాడు. అతనిపై గతంలోనే మూడు NDPS కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు.
కామారెడ్డి ప్రాంతం నుంచి అల్ఫ్రాజోలంను అక్రమంగా తీసుకువచ్చి కొంపల్లి, కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.
నిందితుల నుంచి అల్ఫ్రాజోలం డ్రగ్‌తో పాటు రవాణాకు ఉపయోగించిన కారు, బైక్, సెల్‌ఫోన్లు, రూ.40 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ముఠా వెనుక ఉన్న డ్రగ్స్ సరఫరా వ్యవస్థ, ఇతర వ్యక్తుల ప్రమేయంపై పేట్ బషీరాబాద్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
#sidhumaroju
Alwal










