వెలిగల్లులో నేటి నుంచి శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు.|

0
0

అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం మండలం, వెలిగల్లులోని నూతన శ్రీకృష్ణ ఆలయంలో సెప్టెంబర్ 2 నుంచి 4వ తేదీ వరకు 3 రోజుల పాటు విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 2న గణపతి, నవగ్రహ పూజలు, కలశస్థాపన, 3న శ్రీకృష్ణుడి గ్రామోత్సవం, 4న శాస్త్రోక్తంగా విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది.

4వ తేదీ మధ్యాహ్నం ఆలయం వద్ద భక్తులకు అన్నసంతర్పణ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాలు అన్నమయ్య, తంబళ్లపల్లె, మదనపల్లె ప్రాంతాలలో జరగనున్నాయి.