ప్రజల ఆస్తుల పరిరక్షణకు ఎంతటి పోరాటానికైనా సిద్ధం: మర్రి.|

0
7

● కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ నిరసనలు

● 22-A బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం

● మల్కాజ్‌గిరిలో బీఆర్‌ఎస్‌లో చేరిన పలువురు యువకులు

అల్వాల్, సెప్టెంబర్‌ 3: కాంగ్రెస్‌ ప్రభుత్వం 1000 రోజుల ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో గురువారం పలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.

ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డి ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో 22-A నిషేధిత ఆస్తుల జాబితా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాలనీ వాసులతో సమావేశాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిజమైన ప్రైవేట్‌ ఆస్తులను 22-A జాబితా నుంచి తొలగించి బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానని తెలిపారు. ప్రజల ఆస్తుల పరిరక్షణ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని చెప్పారు.

“22-A భూతాన్ని మల్కాజ్‌గిరి నుంచి తరిమికొడతాం. బాధితులకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదు” అని మర్రి రాజశేఖర్‌ రెడ్డి స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని ఎమ్మెల్యే విమర్శించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

తుర్కపల్లి శ్రీధం గ్రీన్‌ పార్క్‌ అవెన్యూ, రామకృష్ణాపురం, ఆఫీసర్స్‌ కాలనీ, వెంకటేశ్వర నగర్‌, సప్తగిరి కాలనీ, శ్రీనగర్‌ కాలనీ, సర్దార్‌ పటేల్‌ నగర్‌, దుర్గా నగర్‌, మల్కాజ్‌గిరి, బాలరాం నగర్‌, సీతారాం నగర్‌, ఆదర్శ్‌ నగర్‌, న్యూ విద్యానగర్‌, అల్వాల్‌ హిల్స్‌, పద్మావతి కాలనీ, వేణుగోపాల్‌ నగర్‌, ఎగ్జిక్యూటివ్‌ కాలనీ, గౌతమ్‌ నగర్‌ డివిజన్‌లోని మల్లికార్జున నగర్‌ తదితర ప్రాంతాల ప్రజలతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు.

అనంతరం మల్కాజ్‌గిరిలో నిర్వహించిన నిరసనలో పాల్గొని 22-A సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజలతో కలిసి ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.

ఇదిలా ఉండగా.. గౌతమ్‌ నగర్‌ డివిజన్‌ మల్లికార్జున నగర్‌లో పలువురు యువకులు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

కార్యక్రమంలో మాజీ ఎంబీసీ చైర్మన్‌ నందికంటి శ్రీధర్‌, మాజీ కార్పొరేటర్లు జగదీష్‌ గౌడ్‌, మేకల సునీత, రాము యాదవ్‌, శాంతి శ్రీనివాస్‌ రెడ్డి, సబిత అనిల్‌ కిషోర్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరై కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

#Sidhumaroju

Alwal