AP: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. సీబీఐకి అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరిని అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు.
హత్యకు ముందు, ఆ తర్వాత జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. దస్తగిరి సమర్పించిన బ్యాంక్ స్టేట్‌మెంట్లను పరిశీలిస్తూ, రూ. 40 కోట్ల డీల్ వ్యవహారంలో నిజానిజాలను వెలికితీస్తున్నారు. గతంలో సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో, హత్య ఒప్పందం వెనుక రూ. 40 కోట్లు చేతులు మారినట్లు, తనకు రూ. 5 కోట్లు ఇస్తామని చెప్పినట్లు దస్తగిరి వెల్లడించారు.










