కడప బేసిన్‌లో లిథియం, గ్యాలియం.. ఏపీకి కొత్త ఆశలు.

0
0

కడప బేసిన్‌లో లిథియం, గ్యాలియం ఖనిజాల ఆనవాళ్లు బయటపడటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై దేశవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. ఈ ఖనిజాల అన్వేషణకు రూ.140 కోట్లతో ఒక కార్యక్రమం ప్రారంభం కానుంది. లిథియం బ్యాటరీల తయారీలో, గ్యాలియం సెమీకండక్టర్ల తయారీలో కీలకమైనవి.

ప్రాథమిక అధ్యయనాల్లో కడపలో లిథియం సాంద్రత 1,000 పీపీఎం, గ్యాలియం సాంద్రత 250 పీపీఎం వరకు ఉందని గుర్తించారు. దేశంలో ఇప్పటికే జమ్మూ కశ్మీర్, కర్ణాటకలో లిథియం వనరులు గుర్తించబడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌కు బరైటీస్, లైమ్‌స్టోన్, ఇనుప ఖనిజం వంటి సహజ సంపద ఇప్పటికే ఉంది.