సీతానగరంలో యాక్సిడెంట్.. వ్యక్తి స్పాటెడ్ |

0
1

సీతానగరంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. సీతానగరం బ్రిడ్జి చినబోగిల అండర్ పాస్ బ్రిడ్జి మధ్య ఈ ప్రమాదం జరిగింది.

మృతుడు మక్కువకు చెందిన లైన్ ఇన్స్పెక్టర్ లండ శ్రీనివాసరావుగా గుర్తించారు. అండర్పాస్ బ్రిడ్జి నుంచి కొత్త బ్రిడ్జ్ ఎక్కుతుండగా వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.