25% ఉచిత అడ్మిషన్లపై కీలక నిర్ణయం |

0
1

ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం అమలుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా హక్కు చట్టం-2009 ప్రకారం ప్రైవేట్ స్కూళ్లలో 25 శాతం సీట్లను నిరుపేద విద్యార్థులకు ఉచితంగా కేటాయించాల్సి ఉండగా.

ఈ విధానంలో ఉన్న మార్గదర్శకాలను సవరించి, పటిష్ఠంగా అమలు చేసేందుకు ఒక రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఈ రిజర్వేషన్ ఫలాలు పూర్తిస్థాయిలో అందేలా చూడటమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ అంశంపై లోతుగా అధ్యయనం చేసేందుకు 16 మంది సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించింది. పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా ఈ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించనుండగా, సమగ్రశిక్షా ఎస్పీడీ కన్వీనర్‌గా ఉంటారు. వీరితో పాటు విద్యార్థుల తల్లిదండ్రుల ప్రతినిధులు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు కూడా ఈ కమిటీలో స్థానం కల్పించారు.