మదనపల్లిలో టీచర్స్ డే వేడుకలకు ఎమ్మెల్యే కిషోర్ కు ఆహ్వానం. |

0
1

మదనపల్లెలో సెప్టెంబర్ 5న జరగనున్న టీచర్స్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని విద్యాశాఖ అధికారులు గురువారం ఆహ్వానించారు.

అన్నమయ్య జిల్లా, మదనపల్లెలో ఈ కార్యక్రమం జరగనుంది. కలికిరి మండలం నగిరిపల్లిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో DEO సుబ్రమణ్యం, DCEB గంగాధర్, DSO శ్రీధర్ కుమార్ ఆహ్వాన పత్రికను అందజేశారు.

విద్యారంగ అభివృద్ధి, ఉపాధ్యాయుల సంక్షేమానికి ఎమ్మెల్యే కిషోర్ ఎల్లప్పుడూ సహకరిస్తున్నారని అధికారులు తెలిపారు. ఆహ్వానాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే, టీచర్స్ డే వేడుకలకు తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చారు.