బొబ్బిలి పట్టణంలోని అంగన్వాడీ కేంద్రాల్లో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి.అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషాధారణ వేసి అలరించారు.
చిన్నారులతో ఉట్టి కొట్టించి సంబరాలు జరిపారు. అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్వాడీలు పాల్గొన్నారు.










