హామీల అమలులో కాంగ్రెస్ విఫలం.. బీఆర్ఎస్ వంటా వార్పు |

0
45

🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల వైఫల్యాల పాలనకు నిరసనగా ఆసిఫాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ శ్రేణులు శుక్రవారం వినూత్నంగా వంటా వార్పు నిర్వహించాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ. ఎన్నికల హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ పాలన వెయ్యి పడగల మాయగా మారిందని విమర్శించారు.

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ నిరసన చేపట్టినట్లు వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో బిఆర్ఎస్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.