📍 అనంతపురం జిల్లా :
ప్రైవేట్ బస్సు దగ్ధం ఘటనాస్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS గారు
బెంగళూరు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు జిల్లాలోని పెద్దవడగూరు మండలం మిడతూరు సమీపంలోని జాతీయ రహదారిపై అగ్నిప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైంది.
ఈ సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS గారు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద తీవ్రతను పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రమాదం అసలు ఎలా జరిగింది? మంటలు వ్యాపించడానికి గల కారణాలేంటి? అనే వివరాలను స్థానిక డీఎస్పీ, సీఐలను అడిగి ఎస్పీ తెలుసుకున్నారు.
ఘటనపై పూర్తి స్థాయి లోతుపాతులపై సమగ్ర విచారణ జరిపి నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారితో పాటు గుంతకల్లు డీఎస్పీ ఏ. శ్రీనివాస్, సీఐలు నరేంద్రరెడ్డి, శివశంకర్ నాయక్, ఎస్సై రాఘవేంద్రప్ప, తదితరులు ఘటనా స్థలానికి వెళ్లారు.










