పండగ వేళ విషాదం.. కరెంట్ షాక్‌తో బాలిక మృతి! |

0
1

భారత్ అవాజ్ న్యూస్:- సెప్టెంబర్ 5 తేదీన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం లో కరెంట్ షాక్ తో ఓ బాలిక మృత్యువాత పడిన ఘటన స్థానికంగా అందరినీ కన్నీరు పెట్టిస్తోంది.నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన పిట్టల రమేష్ కూతురు పిట్టల సిరివెన్నెల (14) కృష్ణాష్టమి నేపథ్యంలో ఉదయాన్నే స్నానం చేయడానికి వెళ్ళింది. మోటార్ ఆన్ చేయడానికి స్విచ్ వేయడంతో కరెంట్ షాక్ కి గురైంది. అప్పటికే ఎలుకలు వైర్లను కొట్టివేయడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

అపస్మారక స్థితిలోకి వెళ్లిన కూతురును చూసి కంగారు పడిన తండ్రి వెంటనే 108 కి సమాచారం అందించారు. సంఘటనాస్థలికి చేరుకున్న ఈ.ఏం.టీ దస్రు సీ.పీ.ఆర్ చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. మృతి చెందినట్లు సిబ్బంది తెలిపారు. ఈ రోజు స్కూల్ ఉన్నా పాప బతికేది అంటూ తండ్రి చేస్తున్న ఆర్త నాదాలు స్థానికులను కన్నీరు పెట్టించాయి. సిరివెన్నెల స్థానిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నట్లు సమాచారం. క్షణాల వ్యవధిలో విగత జీవిగా మారిన కూతురును చూసి బాధిత కుటుంబం రోదించడంతో నల్లబెల్లి లో పండగ వేళ విషాద ఛాయలు అలుముకున్నాయి… దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము…