అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని సంబేపల్లి మండలంలో ఇటీవల విద్యుత్ షాక్కు గురై మృతి చెందిన కుటుంబానికి రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అండగా నిలిచారు. ఘటనపై స్పందించిన మంత్రి బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా అందించడంతో పాటు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
మంత్రి ఇచ్చిన హామీ మేరకు బాధిత కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా చెక్కును మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కలిసి అందజేశారు. ఈ సందర్భంగా కష్టకాలంలో ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని మంత్రులు తెలిపారు.
బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించే హామీని కూడా త్వరితగతిన అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల కష్టాల్లో వారికి తోడుగా నిలవడం, ఇచ్చిన హామీలను అమలు చేయడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి అవసరమైన సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం ముందుంటుందని తెలిపారు.










