హన్మకొండ జిల్లా శాయంపేటలో ఎమ్మెల్సీ తాతా మధు దిష్టిబొమ్మ దగ్ధం|

0
1

రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న శాసనసభ స్పీకర్ పై అత్యంత హేయంగా, అవమానకరంగా దూషిస్తూ, కించపరిచిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును పదవినుండి తొలగించాలని, అలాగే శాసన సభ ఆవరణలో మహళా పోలీసుల ముందు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చేసిన వికృత చేష్టలు సభ్య సమాజానికి తలవంపని శాయంపేట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు.ఈ సందర్భంగా శాయంపేట ప్రధాన కూడలిలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం మాట్లాడుతూ ఒక దళితుడైన స్పీకర్ ను వాడు వీడు అని సంబోధించడం , అత్యంత జుగుప్సాకరంగా దూషించడం హేయమైన చర్య అని, సభాపతికి జరిగిన అవమానం సభ్య సమాజానికి జరిగిన అవమానమని ఇటువంటి వ్యక్తులు సభల్లో కొనసాగితే తెలంగాణ చట్ట సభలకు చెడ్డ పేరు వస్తుందని కావున తాతా మధుపై కఠినచర్యలు తీసుకుని పదవినుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కృష్ణమూర్తి, చిందం రవి, మస్కే కుమార్, మోతె వెంకటేశ్వర్లు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.