మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీరాంపూర్ జెడ్పీ హైస్కూల్‌లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అల్పాహార పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. మేయర్ దర్ని మధుకర్, స్థానిక కార్పొరేటర్ తాళ్ళ సంపత్ రెడ్డితో కలిసి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు విశేష కృషి ఫలితంగా మంచిర్యాలలో సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు కావడం సంతోషకరమన్నారు. తెలంగాణ ప్రభుత్వం, హరే కృష్ణ ఫౌండేషన్ సహకారంతో విద్యార్థులకు పౌష్టికాహారం అందుతోందని పేర్కొన్నారు.










