International literacy day|

0
0

అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం 60వ వార్షికోత్సవం సందర్భంగా అక్షరాస్యత కోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. అక్షరాస్యత ఒక ప్రాథమిక మానవ హక్కు మాత్రమే కాదు. జీవితాలను, ఆర్థిక వ్యవస్థలను, సమాజాలను పరివర్తన చేసే శక్తివంతమైన సాధనం.

 

📚 అక్షరాస్యత ప్రతి ఒక్కరి హక్కు. అక్షరం ప్రతి ఇంటా వెలుగులు నింపాలి. ప్రతి బిడ్డకూ విద్య అందాలి. ఎవరూ చదువుకు దూరం కాకూడదు. ప్రతి బిడ్డనూ బడిలో చేర్పించి, విద్యకు అవసరమైన అన్ని అవకాశాలను కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.

 

📚 అక్షరజ్ఞానం కేవలం చదవడం, రాయడం నేర్పడానికే పరిమితం కాదు. ఒక మనిషి తన హక్కులను తెలుసుకునే అవగాహనతో పాటు, భవిష్యత్తును తీర్చిదిద్దుకునే ఆత్మవిశ్వాసాన్ని, కుటుంబాన్ని, సమాజాన్ని ముందుకు నడిపించే శక్తిని అందిస్తుంది.

 

📚 ఒక అక్షరం జీవితాన్ని మార్చగలదు. ఒక్క చదువుకున్న వ్యక్తి ఒక తరాన్ని మార్చగలడు. అక్షరాస్యతను ఒక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లి, విద్యావంతమైన, జ్ఞానవంతమైన, సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి అందరం కలిసికట్టుగా కృషి చేయాలి.

 

అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవ శుభాకాంక్షలు

 

– ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు