LPG Booking: 25 రోజులకు గుడ్ న్యూస్.. కీలక మార్పు|

0
3

గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిస్తూ ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ గడువును తగ్గించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివరకు ఉన్న 45 రోజుల రీఫిల్ నిబంధనను 25 రోజులకు కుదించింది. కేంద్ర మంత్రి సురేశ్ గోపి ఈ విషయాన్ని వెల్లడించారు. మెరుగైన ఎల్పీజీ సరఫరా పరిస్థితుల దృష్ట్యా పట్టణాలతో సమానంగా గ్రామీణ ప్రాంతాలకు కూడా ఇకపై 25 రోజులకే సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం లభించింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ కొత్త నిబంధనను తక్షణమే అమలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.