తాను క్రమం తప్పకుండా వాడే న్యూట్రిషన్ ప్రొడక్ట్ (ప్రోటీన్ పౌడర్)లో చిన్న పురుగులు కనిపించాయని ప్రముఖ బాలీవుడ్ నటి బిపాషా బసు సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఆమె, మహారాష్ట్ర ఎఫ్‌డీఏ (FDA) చీఫ్ తుకారం ముండే దృష్టికి తీసుకెళ్తూ ఫిర్యాదు చేశారు.
సదరు అధికారిని సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ, “మీరే మా చివరి ఆశ.. ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవాలి” అని విజ్ఞప్తి చేశారు. అయితే, ఈ ఆరోపణలపై సంబంధిత ప్రొడక్ట్ కంపెనీ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి స్పందనా రాలేదు. మరోవైపు, ప్రొడక్ట్‌లో పురుగులు ఉన్నాయనే అంశాన్ని అధికారులు కూడా ఇంకా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.










