మదనపల్లె మండలం కాట్లాటపల్లి గ్రామ సమీపంలో గురువారం భూ వివాదం కారణంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం దాడులు చేసుకోవడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. విశ్వనాథరెడ్డిపై కత్తితో దాడి జరగడంతో చేతి వేలు తెగిపోయి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. భూమి ఆక్రమణకు యత్నించడంతోనే దాడి జరిగిందని బాధితులు ఆరోపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.










