లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి ఆసిఫాబాద్ ఎస్పీ నితికా పంత్|

0
118

ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్‌ను ప్రజలు పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకోవాలని కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్ ఒక ప్రకటనలో సూచించారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల వివాదాలను ఇరువర్గాల పరస్పర అంగీకారంతో, సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ ఒక అద్భుతమైన అవకాశమని ఆమె పేర్కొన్నారు.చిన్న చిన్న వివాదాలను పట్టింపులకు పోయి పెద్దవిగా చేసుకోకుండా, ‘రాజీయే రాజమార్గం’ అనే భావనతో సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని ఎస్పీ నితికా పంత్ ప్రజలకు పిలుపునిచ్చారు. లోక్ అదాలత్ ద్వారా సమయం, డబ్బు ఆదా అవ్వడమే కాకుండా ఇరువర్గాల మధ్య సఖ్యత పెరుగుతుందని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు.