ఇంటర్నేషనల్ అవార్డులకు కదిరి పాత్రికేయులు ఎంపిక

0
0

కదిరి: శ్రీ సత్యసాయి జిల్లా కదిరికి చెందిన పాత్రికేయులు కె. రామచంద్ర, ఎస్. బాబా ఫక్రుద్దీన్, టి.డి. జయరాంరెడ్డిలు బెంగళూరులోని ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సంస్థ అందించే జాతీయ అవార్డులకు ఎంపికయ్యారు.ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సంస్థ 14వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ అవార్డులకు వీరిని ఎంపిక చేసినట్లు సంస్థ అధ్యక్షులు సి.ఎస్. శివరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ నెల 12వ తేదీన బెంగళూరులోని అంబేద్కర్ భవన్‌లో నిర్వహించే అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో వీరిని ఘనంగా సత్కరించి పురస్కారాలను అందజేయనున్నారు.దీర్ఘకాలంగా పాత్రికేయ రంగంలో కొనసాగుతూ ప్రజా సమస్యలు, సామాజిక అంశాలపై కథనాలు అందిస్తున్న కదిరి పాత్రికేయులకు ఈ అవార్డులు దక్కడం పట్ల స్థానిక పాత్రికేయులు హర్షం వ్యక్తం చేశారు.చిక్‌బళ్లాపూర్ జిల్లా పాత్రికేయులు టి.ఎస్. నాగేంద్రబాబు, జయరామ్, వెంకటేష్, కృష్ణాచారి తదితరులు అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపారు.