భారత్ అవాజ్ న్యూస్ :.కదిరి పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మక్బూల్ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజా సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
చిన్నచిన్న విభేదాలను పక్కనపెట్టి పార్టీ శ్రేణులు ఒక్కతాటిపైకి రావాలని, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని సూచించారు. పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉంటానని, కార్యకర్తలను కాపాడుకోవడం తన బాధ్యతని భరోసా ఇచ్చారు. అనంతరం పార్టీ శ్రేణులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండా ప్రతి గ్రామంలో ఎగరేలా సమష్టిగా కృషి చేయాలని మక్బూల్ కోరారు.










