సిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం |

0
1

భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి : నల్లచెరువు మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ ఎస్సీ కాలనీలో సిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సిమ్స్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, ఎన్.వై.పి.ఎస్.ఎన్. ఫౌండర్ నిసార్ యాసిన్ ఖాన్ ఆధ్వర్యంలో ఈ శిబిరం నిర్వహించారు.

శిబిరంలో స్థానిక ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య సమస్యలను వైద్యులు పరిశీలించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలను కొనసాగిస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ నగర్ వాసులు, శ్రీ మారెమ్మ స్వామి కమిటీ సభ్యులు శిబిరం నిర్వహించిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.