హైడ్రాకు సుప్రీం షాక్.|

0
2

● 40 ఎకరాల భూమి వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు

● హైకోర్టు తీర్పును సమర్థించిన అత్యున్నత న్యాయస్థానం

అల్వాల్, సెప్టెంబర్ 15: మల్కాజిగిరి పరిధిలోని లోతుకుంటలో సర్వే నంబర్లు 1, 2లో ఉన్న సుమారు 40 ఎకరాల భూమికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం, శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ మధ్య కొనసాగుతున్న వివాదంలో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది.

ఈ భూమి తెలంగాణ ప్రభుత్వానికి చెందినదంటూ కాంగ్రెస్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసినట్లు సమాచారం.

ఈ వ్యవహారంలో గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించినట్లు తెలుస్తోంది.

ఇదే కేసుకు సంబంధించి గతంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై కూడా తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. భూమికి సంబంధించిన వివాదం నేపథ్యంలో కోర్టు ఆదేశాల అమలుపై విచారణ కొనసాగింది.

#Sidhumaroju

Alwal