● వీరబ్రహ్మేంద్ర స్వామివారిని దర్శించుకున్న ఎంపీ
● ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థన
అల్వాల్, సెప్టెంబర్ 17: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ పరిధిలోని జీడిమెట్ల గ్రామం బ్రహ్మంగారి గుట్ట వద్ద శ్రీ శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో నిర్వహించిన శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ యజ్ఞ మహోత్సవంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు.
ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు కార్యక్రమానికి హాజరైన ఎంపీ ఈటల రాజేందర్ యజ్ఞ మహోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని స్వామివారిని ప్రార్థించారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎంపీ ఈటల రాజేందర్‌ను సత్కరించారు. కార్యక్రమంలో బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహారెడ్డి, కృష్ణమాచారి, సంతోష్ చారి, వెంకటేష్ చారి, శేఖర్ చారి, రాజేష్ చారి, సతీష్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
#Sidhumaroju
Alwal










