అమరవీరుల శిబిరంలో ఉద్యమకారుల దీక్షలు.|

0
12

• జేఏసీ చైర్మన్‌ సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు

• మూడో రోజు దీక్షలో 11 మంది ఉద్యమకారులు

• దీక్షా శిబిరానికి తరలివచ్చిన పలువురు నేతలు

అల్వాల్‌, సెప్టెంబర్‌ 19: తెలంగాణ ఉద్యమకారుల ఆల్వాల్ జేఏసీ చైర్మన్‌ సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరుల శిబిరంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. 

డిమాండ్ల సాధన కోసం చేపట్టిన దీక్షల్లో భాగంగా శనివారం పలువురు ఉద్యమకారులు దీక్షలో కూర్చున్నారు.

మూడో రోజు దీక్షలో మాట్లూరి అనిల్‌కుమార్‌, మోతుకూరి మల్లేష్‌, జానకి రెడ్డి, శేరుపల్లి మల్లేష్‌, వెంకటేష్‌ యాదవ్‌, సతీష్‌, రమేష్‌ చారి, నరేష్‌, రాజేష్‌, అనిల్‌ రాజు, నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.

దీక్షా శిబిరాన్ని సందర్శించిన జేఏసీ చైర్మన్‌ సురేందర్‌రెడ్డి, అనంతుల సంతోష్‌, డోలి సుధీర్‌, మంద శోభన్‌బాబు, సంగమేశ్వర్‌, రమేష్‌, నరేష్‌ తదితరులు దీక్షలకు సంఘీభావం తెలిపారు.

#sidhumaroju

Alwal